'టాలీవుడ్ మన్మథుడు'పై మనసుపారేసుకున్న మంచు లక్ష్మి!

ఆదివారం, 29 నవంబరు 2020 (09:20 IST)
టాలీవుడ్ మన్మథుడుగా గుర్తింపు పొందిన హీరో అక్కినేని నాగార్జున. ఈ హీరోను ఇష్టపడని అమ్మాయిలే ఉండరు. అలాంటి వారిలో నటి మంచు లక్ష్మి కూడా చేరిపోయింది. అక్కినేని నాగార్జునను అమితంగా ఇష్టపడినట్టు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా, బాలీవుడ్ అగ్రహీరో అమీర్ ఖాన్‌ను అయితే పెళ్లి చేసుకోవాలని భావించిందట. పైగా, ఆయనకు పెళ్లి జరుగుతుంటే ఇంట్లో కూర్చొని వెక్కివెక్కి ఏడ్చిందట. ఈ విషయాన్ని మంచు లక్ష్మి స్వయంగా వెల్లడించింది. 
 
తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను అమీర్ ఖాన్‌ను అమితంగా ఇష్టపడినట్టు చెప్పుకొచ్చింది. పైగా, ఆయనకు వివాహం అవుతుంటే బోరున విలపించింది. రెండోపెళ్లి సమయంలోనూ ఇదేవిధంగా ప్రవర్తించిందట. దీనికి కారణం... అమీర్ ఖాన్‍‌ను అమితంగా ఇష్టపడటమేనట. ఆ తర్వాత తెలుగు అగ్రహీరో నాగార్జునను కూడా అమితంగా ప్రేమించి, ఇష్టపడినట్టు చెప్పుకొచ్చింది. 
 
కాగా, మల్టీ టాలెంటెడ్‌ పర్సన్‌గా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి... సీనియర్ హీరో డాక్టర్ మోహన్‌ బాబు నటవారసురాలిగా నటిగా తనని తాను నిరూపించుకుంది. ఇక వ్యాఖ్యాతగా, నిర్మాతగా ఇలా అనేక రంగాల్లో రాణిస్తున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు