సరికొత్తగా కలియుగం పట్టణంలో.. రివ్యూ రిపోర్ట్

డీవీ

శుక్రవారం, 29 మార్చి 2024 (12:57 IST)
Kaliyuga pattnamlo
విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి,  డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మాతలు. ఈరోజే సినిమా విడుదలైంది. మరి ఎలా వుందనేది  చూద్దాం.
 
కథ
నంథ్యాలలో మధ్యతరగతి కుటుంబంలో కవల పిల్లలు విజయ్ (విశ్వ కార్తికేయ), సాగర్ ( విశ్వ కార్తికేయ). మోహన్ (దేవీ ప్రసాద్), కల్పన (రూప లక్ష్మి) తల్లి దండ్రులు. విజయ్ మంచివాడు. రక్తం చూస్తేనే బయపడతాడు. సాగర్ కు రక్తం చూడగానే ఆనందంతో సైకోలా మారతాడు. కాలేజీలో విజయ్ మంచితనం చూసి శ్రావణి (ఆయుషి పటేల్) ఇష్టపడుతుంది. అయితే ఆడవాళ్ళను అత్యాచారాలుచేసే వారిని ఆమె వేటాడి చంపుతుంది. ఇలాంటి కేస్ లను పరిశోధించే పోలీస్ అధికారి (చిత్రా శుక్లా) వచ్చాక కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. అవి ఏమిటి? తర్వాత కథ ఎటువైపు మలుపు తిరిగింది? అనేది మిగిలిన సినిమా. 
 
సమీక్ష:
బాలనటుడిగా నటించి మెప్పించి హీరోగా కొద్ది సినిమాలు చేసిన విజయ్ ద్విపాత్రాభినయం చేయడం విశేషమేకాదు. రెండు పాత్రల వైవిధ్యాన్ని చూపడం మరో విశేషం. సైకో పాత్రలో భయపెట్టిస్తాడు. నటన పరంగా చాలా మెచ్చూర్డ్ గా చేశాడనే చెప్పాలి. డాన్స్, యాక్షన్ పరంగా సిన్సియర్ తనం కనిపిస్తుంది. ఆయుషి పటేల్ ఫస్ట్ హాఫ్ లో, చిత్రా శుక్లా సెకండ్ హాఫ్ లో ఆకట్టుకుంటుంది. మిగిలిన వారు నరేన్, దేవీ ప్రసాద్, రూప లక్ష్మి, అనీష్ కురువిల్ల వారి పాత్రలకు న్యాయం చేశారు.
 
దర్శకుడు రమాకాంత్ రెడ్డి ఆసక్తికరమైన పాయింట్ తీసుకున్నాడు.ఇలాంటి కథలు గతంలో శింబు సినిమాల్లో కనిపించినా నేపథ్యం తదితర విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే ఆ కోణంలో క్రైమ్స్ నీ ఇలాకూడా చేయవచ్చు అనే కొత్త ఆలోచనను రేకెత్తించాడు. ఈ కథకు స్క్రీన్ ప్లే కీలకం. ఫస్ట్ హాఫ్ అంతా ప్రశ్నలు, చిక్కుముల్లతో నిండి పోయింది. వాటికి సమాధానాలు సెకండ్ హాఫ్ లో దొరుకుతాయి. 
 
ద్వితీయార్థంలో ట్విస్టుల ఒక్కోటి రీవీల్ అవుతుంటే ప్రేక్షకులకు సరికొత్తగా అనిపిస్తుంది. రెండో పార్ట్ కోసం పెట్టుకున్న కథ బాగుంది. పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా పెంచాలి.. ఎలా పెంచకూడదు.. తల్లిదండ్రుల పెంపకం సమాజం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు.
 
సాంకేతికంగా చూస్తే, అజయ్ పాటలు, రీ రికార్డింగ్ బాగుంది. చరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. మాటలు కొన్ని చోట్ల మెప్పిస్తాయి. అక్కడక్కడా చిన్నపాటి లోపాలున్నా, కతనంలో వాటిని మర్చిపోయేలా చేశాడు దర్శకుడు. మరింత జాగ్రత్తలు తీసుకుంటే సినిమా రేంజ్ మరింత పెరిగేది. క్రైమ్ సినిమాలలో వుండే ఉత్కంటను బాగా చూపించాడు. నిర్మాతలు సరియైన విధంగా నిర్మించారు. సిన్సియర్ నెస్ కనిపిస్తుంది. విశ్వకార్తికేయలోని నటనా కోణం ఈ సినిమాలో కనిపించేలా దర్శకుడు చేశాడు.
రేటింగ్ 3/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు