జాతకం

మేషం
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. ఆపత్సమయంలో ఆప్తులు ఆదుకుంటారు. వాయిదా పడుతున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. సోమవారం నాడు పరిచయం లేని వారితో మితంగా సంభాషించండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. కొత్త యత్నాలు మెదలు పెడతారు. గృహమార్పు కలిసివస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఉద్యోగ విధుల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.