జాతకం


మేషం
మేషం : వ్యాపారాల్లో నష్టాలను భర్తీ చేసుకోవడంతో పాటు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరుకావడం మంచిది. మీ సంతానంపై చదువుల కోసం పొదుపు పథకాలు చేపడతారు. దైవ దర్శనాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగా జరుగుతాయి.
రాశిచక్ర అంచనాలు

వృషభం
వృషభం : బంధు మిత్రులు మీ నుంచి పెద్ద మొత్తంలో ధనసహాయం హామీలు కోరుతారు. నూతన పరిచయారేల్పడతాయి. ఉన్నత స్థాయి అధికారుల హోదా మరింత పెరిగే సూచనలు ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయత్నపూర్వకంగా మొండిబాకీలు వసూలు కాగలవు.
రాశిచక్ర అంచనాలు

మిథునం
మిథునం : స్త్రీలకు అకాల భోజనం, శారీరకశ్రమ వల్ల ఆరోగ్య మందగిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు మీ పురోభివృద్ధికి దోహదపడతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. ఆలయాలను సందర్శిస్తారు. ధనవ్యయం అధికమైన ఆశించిన ఫలితం పొందుతారు.
రాశిచక్ర అంచనాలు

కర్కాటకం
కర్కాటకం : నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. మీ సంతానం కోసం విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తుల ట్రాన్స్‌ఫర్, ప్రమోషన్లలో జాప్యం తగదు.
రాశిచక్ర అంచనాలు

సింహం
సింహం : హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆత్మీయుల నడుమ కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. స్త్రీలకు దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ అభిరుచి, ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.
రాశిచక్ర అంచనాలు

కన్య
కన్య : వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. మిత్రులను కలుసుకుంటారు. మీ చొరవ, మాటతీరు అందరినీ ఆకట్టుకుంటాయి. ఉద్యోగస్తులకు పరిచయ వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు.
రాశిచక్ర అంచనాలు

తుల
తుల : భాగస్వామిక, సొంత వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమిస్తారు. దీర్ఘకాలి రుణాలు తీరుతాయి. మీ అవసరాలు ఇబ్బంది లేకుండా గడుస్తాయి. నూతన పరిచయాలేర్పడాయి. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఇతరుల విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తారు.
రాశిచక్ర అంచనాలు

వృశ్చికం
వృశ్చికం : సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. ప్రియతములకు విలువైన కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. అవివాహితుల్లో నూతనోత్సాహం, పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొంటుంది.
రాశిచక్ర అంచనాలు

ధనస్సు
ధనస్సు : ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరాత్రా చికాకులు తప్పవు. వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. వృత్తుల వారికి మంచి గుర్తింపు, అవకాశాలు లభిస్తాయి. ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు చేస్తారు. క్రయ, విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
రాశిచక్ర అంచనాలు

మకరం
మకరం : ఒక సమస్య పరిష్కారం కావడంతో మనస్సు తేలికపడుతుంది. సోదరులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. మీ శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం పొందుతారు. కొన్ని వ్యవహారాలు మీరు ఆశించిన విధంగానే సాగుతాయి. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి.
రాశిచక్ర అంచనాలు

కుంభం
కుంభం : ఉద్యోగస్తులు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక తప్పిద జరిగే ఆస్కారం ఉంది. విద్యార్థుల్లో మనోధైర్యం, ఉత్సాహం నెలకొంటాయి. మిత్రులు వ్యవహరించిన తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. స్త్రీలకు అయినవారి నుంచి ఆహ్వానాలు, వస్త్రప్రాప్తి వంటి శుభపరిణామాలున్నాయి. ఏమాత్రం పొదుపు సాధ్యంకాదు.
రాశిచక్ర అంచనాలు

మీనం
మీనం : బ్యాంకు పనుల్లో ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కొంటారు. క్యాటరింగ్, వృత్తుల వారికి, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. ఉపాధ్యాయుల సహనానికి తగిన బహుమతి లభిస్తుంది. విద్యార్థుల్లో భయాందోళనలు తొలగి మానసికంగా కుదుటపడతారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు.
రాశిచక్ర అంచనాలు