జాతకం

మకరం
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు కొన్ని విషయాలు అనుకున్నట్లే జరుగుతాయి. మీ నమ్మకం వమ్ము కాదు. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. అవసరాలు అతికష్టమ్మీద నెరవేరుతాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. శుక్ర, శని వారాలలో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ప్రముఖుల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో రాణిస్తారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.