జాతకం

కుంభం
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. మనస్థిమితం వుండదు. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. ఏ విషయంపై ఆసక్తి వుండదు. ఆప్తులతో సంభాషిస్తారు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. దుబారా ఖర్చులు విపరీతం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. స్వల్ప అశ్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ప్రయాణం వాయిదా పడుతుంది.