జాతకం

మీనం
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ఈ వారం కలిసివచ్చే సమయం. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఊహించిన ఖర్చులే వుంటాయి. డబ్బుకు ఇబ్బంది వుండదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు సానుకూలమవుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. సంతానం చదువులపై దృష్టి సారిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. గృహ మరమ్మతులు చేపడతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వస్త్ర, పచారి, మందుల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. వాహ చోదకులకు దూకుడు తగదు.