జాతకం

వృషభం
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. బంధువులు ధన సహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసి వస్తుంది. మీ శ్రీమతి ఆంతర్యం గ్రహించండి. గృహంలో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.