జాతకం

మిథునం
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు రూపొందించుకుంటారు. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం వుంటుంది. ఇంటి విషయాలు ఏకరవు పెట్టొద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఆది, సోమ వారాల్లో ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం పడిగాపులు తప్పవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. విద్యార్థులకు ఒత్తిడి అధికం. వేడుకకు హాజరవుతారు.