జాతకం

కర్కాటకం
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష సర్వత్రా అనుకూలదాయకం. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. ప్రణాళికలు రూపొందించుకుంటారు. మంగళ, బుధ వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. గృహమార్పు ఫలితం నిదానంగా కలిసివస్తుంది. వివాహ యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఇరు వర్గాలకు మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదా మార్పు. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం.