జాతకం

కన్య
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు గృహంలో అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ మాటకు అందరూ కట్టుబడి వుంటారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ధనలాభం, వస్త్ర ప్రాప్తి వున్నాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది వుండదు, గురు, శుక్ర వారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వాహన చోదకులకు కొత్త సమస్యలెదురవుతాయి.