
తుల
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ వారం అనుకూలదాయకం. అభీష్టం నెరవేరుతుంది. బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ఫైనాన్సు, చిట్స్ రంగాలకు దూరంగా ఉండండి. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఆకస్మికంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు, ఔషధ సేవనంలో అలక్ష్యం తగదు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదువులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచికే. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి.