జాతకం

వృశ్చికం
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదాలు సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. మీ మాటతీరు అదుపులో వుంచుకోండి. ఎవరినీ నిందించవద్దు. కొత్త సమస్యలెదురవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. సోమ, మంగళ వారల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. పెద్దల సలహా పాటించండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహ యత్నాల తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆరోగ్యం నిలకడగానే వుంటుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పనివారలతో జాగ్రత్త. దైవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.