
ధనస్సు
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రతికూలతలను అధిగమిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలించే సమయం త్వరలోనే ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆదివారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. మీ నుంచి విషయాలు సేకరించేందుకు కొందరు యత్నిస్తారు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. అవివాహితులకు శుభం కలుగుతుంది. వ్యాపారాలు నిదానంగా ఊపందుకుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతలపై దృష్టిపెట్టండి. ఒత్తిళ్లు, ఆవేశాలకు గురికావద్దు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు, పనిభారం. ముఖ్యులకు స్వాగతం, ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.