జాతకం

కుంభం
కుంభ రాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1,2,3 పాదాలు ఆదాయం 14, వ్యయం: 14 రాజపూజ్యం : 6, అవమానం 1 ఈ రాశివారికి ఏలినాటి శనిప్రభావం, గురుబలం లోపం అధికంగా ఉన్నాయి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఊహించని ఖర్చులు, చేతిలో ధనం నిలవదు. ఆచితూచి అడుగేయాలి. దంపతుల మధ్య అకారణ కలహాలు. బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కుంటారు. మనస్థిమితం ఉండదు. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. వాస్తుదోష నివారణ చర్యలు తప్పనిసరి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం. వీరు పోటీ పరీక్షల్లో సామాన్య ఫలితాలే సాధిస్తారు. దూరప్రాంతంలోనే ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. వ్యవసాయ రంగాల వారికి దిగుబడి వంట బాగుంటుంది. ఆశించిన మద్దతు ధర పొందుతారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. ప్రముఖులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ట్రాన్స్‌పోర్టు రంగాల వారికి ఆదాయాభివృద్ధి. న్యాయవాదులు, వైద్యులకు సామాన్యం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వివాహయత్నం ఫలిస్తుంది. తరచూ విందులు, వేడుకల్లో పాల్గొంటారు. ఈ రాశివారికి కనకదుర్గమ్మ స్తోత్ర పారాయణం, శనికి తైలాభిషేకాలు క్షేమదాయకం.