వివాహితపై కన్నేసిన రౌడీ షీటర్, అర్థరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆ పని చేసాడు

శనివారం, 21 నవంబరు 2020 (11:29 IST)
రాయదుర్గం పరిధిలోని డి. హీరేహాళ్ మండలం దొడగొట్టకు చెందిన శ్రీనివాసులు అనే రౌడీ షీటర్ జైలు శిక్ష అనుభవించినా అతడి బుద్ధి మారలేదు. ఓ వివాహితపై కన్నేసి ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నించి మళ్లీ జైలు పాలయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే... శ్రీనివాసులు ఓ హత్య కేసులో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యాడు. జైలు శిక్ష అనుభవించినా అతడి బుద్ధి మారలేదు. అదే ఊరులో వున్న ఓ వివాహితపై కన్నేసాడు. ఆమెను లోబరుచుకునేందుకు ప్రయత్నాలు చేసాడు.
 
బుధవారం రాత్రి సదరు వివాహిత భర్తతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో శ్రీనివాసులు ఆమెపై కిటికీ లోనుంచి రాళ్లు వేసి వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. విషయాన్ని ఆమె వెంటనే భర్తకు చెప్పడంతో అతడు పెద్దగా ఎవర్రా అంటూ కేకలు వేసాడు. దాంతో అతడు పారిపోయాడు. 
 
మరుసటి రోజు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో శ్రీనివాసులుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు