మేషం
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు అధికం. సంప్రదింపులకు అనుకూలం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి.
వృషభం
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త యత్నాలు మొదలు పెడతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పొదుపు ధనం అందుతుంది. పనులు సానుకూలమవుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు.
మిథునం
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనాలోచిత నిర్ణయాలు తగవు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చేపట్టిన పనులు సాగవు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
కర్కాటకం
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నం సాగించండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
సింహం
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. కొత్తయత్నాలు ప్రారంభిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. పనులు వేగవంతమవుతాయి. అవకాశాలను దక్కించుకుంటారు. పరిచయాలు బలపడతాయి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త.
కన్య
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయమకవుతుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా పడతాయి.
తుల
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
చాకచక్యంగా వ్యవహరించాలి. మిమ్ములను తక్కువ అంచనా వేసుకోవద్దు. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. ధైర్యంగా ముందుకు సాగండి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు.
వృశ్చికం
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పరిస్థితులు అనుకూలిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు.
ధనస్సు
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అప్రమత్తంగా ఉండాలి. విలువైన వస్తువులు జాగ్రత్త.
మకరం
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ కించపరచవద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువుల రాక చికాకుపరుస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు.
కుంభం
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థికస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. రుణ బాధలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం. పనులు వేగవంతమవుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు, నోటీసులు అందుకుంటారు.. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది.
మీనం
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ కష్టం ఫలిస్తుంది. కొత్త పరిచయాలేర్పడతాయి, ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు..