మరోవైపు అనంతపురం జిల్లా గుత్తిలో ఏర్పాటుచేసిన ఈవీఎంను గురువారం జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా నేలకేసి కొట్టిన సంగతి తెలిసిందే. పోలింగ్ కంపార్ట్ మెంట్‌లో నియోజకవర్గం పేరును సరిగ్గా రాయలేదని ఆగ్రహం వ్యక్తంచేసిన గుప్తా, పోలింగ్ కేంద్రంలో ఇతర పార్టీల ఏజెంట్లతో గొడవ పడ్డారు. ఈ సందర్భంగా ఈవీఎంను నేలకేసి కొట్టడంతో అది పనిచేయకుండా పోయింది.