ముఖ్యంగా, ఫీజు రియంబర్స్‌మెంట్, అమ్మ ఒడి పథకం నిధులు జమపై ఏపీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో దాని గురించి కూడా చర్చించే అవకాశంవుంది. అలాగే సింహాచలం భూముల విషయంలో సిబిఐ విచారణకు ఏపీ ప్రభుత్వం కోరే అవకాశం ఉందని తెలుస్తుంది.
అన్నిటికంటే ముఖ్యంగా ఏపీలో రోడ్లు అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి. ఈ రోడ్ల దుస్థితిపై విపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నాయి. ఈ క్రమంలో రోడ్ల పరిస్థితి, మరమ్మతుల అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.