ఏపీ మంత్రి అమరనాథరెడ్డి తన గ్రామానికి వస్తున్నాడని తెలిసిన వేళ.. అవ్వ అతని వద్దకు వెళ్లింది. అధికారుల వైఖరితో విసుగు చెందిన ఆ అవ్వ.. మంత్రిన తన గుడిసె వద్దకు తీసుకెళ్లింది. తన భర్తకు ఫించన్ రావట్లేదని.. చలికి, వానకు తీవ్ర ఇబ్బందులు పడుతూ గుడిసెలో ఉండలేకపోతున్నామని.. కనీసం రేకుల ఇళ్లైనా ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.