సంక్రాంతి పండుగ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఈ పండుగ కోసం 3120 బస్సులను నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. అలాగే, తిరుగు ప్రయాణంలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు 3280 బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంది.
ప్రయాణికులు రానుపోను ఒకేసారి టిక్కెట్ రిజర్వు చేయించుకుంటే పది శాతం, నలుగురి మించి కుటుంబ సభ్యులందరూ ఒకేసారి ప్రయాణిస్తే 5 శాతం, అలాగే వాలెట్ ద్వార టిక్కెట్ కొనుగోలు చేస్తే 5 శాతం, వృద్ధుల చార్జీల్లో 25 శాతం తగ్గింపు ప్రకటించింది. ఈ సంక్రాంతి బస్సులు శుక్రవారం నుంచి ఈ నెల 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. మొత్తంగా 3120 బస్సులను అధికారులు సిద్ధం చేశారు.