రాజకీయాల్లో ప్రత్యర్థులకు ఏ చిన్న క్లూ దొరికినా ఎట్టి పరిస్థితుల్లో వదలరు. దాన్ని 100 శాతం వాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. అలాంటిదే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తోంది. అసలు సంగతి ఏంటయా అంటే, వైకాపా నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఓటుకు నోటు కేసులో టీడీపీ యువనేత లోకేశ్ బాబుకు కూడా పాత్ర ఉందన్నట్లు మాట్లాడుతున్నారు.
స్టీఫెన్ సన్కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి దొరికిపోయిన క్రమంలో, అసలు రేవంత్ ప్రయాణించిన కారును నడిపి అక్కడికి వెళ్లిన డ్రైవర్ లోకేశ్ కారు డ్రైవర్ అంటూ బొత్స ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఈ కేసులోకి నారా లోకేష్ బాబును కూడా లాగాలని వైకాపా నాయకుడు బొత్స చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి కేసు దర్యాప్తులో ఏం తేలుతుందో వెయిట్ అండ్ సీ.