పెదకాకాని సర్పంచి, వార్డు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. గ్రామంలోని పోలింగ్ బూత్‌లను అర్బన్ ఎస్పీ పరిశీలించారు. అత్యవసర సమయంలో ఎలా వ్యవహరించాలో స్థానిక సీఐ బండారు సురేష్‌బాబుకు ఎస్పీ పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ మాట్లాడుతూ, గ్రామంలో మొత్తం 40 పోలింగ్ కేంద్రాలుండగా, లూథర్‌గిరి కాలనీ, వెంగళ్రావునగర్ కాలనీలో 16 సమస్యాత్మక బూత్‌లను గుర్తించామన్నారు. లూథర్‌గిరి కాలనీలో డీఎస్పీ స్థాయి అధికారిని కేటాయించన్నట్లు తెలిపారు. పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది సహకారం పోలీసులు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.