కొమోరిన్ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించిందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మంగళవారం ఏపీలోని పలు ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణం నెలకొంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. కోస్తాంధ్రలో కొన్ని చోట్ల, రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.