హైదరాబాద్, బోడుప్పల్ ప్రాంతానికి చెందిన 35 యేళ్ల మహిళ భవన నిర్మాణ రంగ కార్మికురాలిగా పనిచేస్తోంది. సోమవారం పని ముగిసిన తర్వాత రాత్రి 10.30కి ఇంటికి బయలుదేరింది. ఉప్పల్ ప్రధాన రహదారిపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో నల్ల చెరువు వద్ద ఇద్దరు యువకులు బైకుపై ఆమెను వెంబడించి చెరబట్టారు.
పిమ్మట ఆమె కేకలు వేయకుండా నోట్లో తువ్వాలు కుక్కి... బలవంతంగా పీర్జాదిగూడ ప్రభుత్వ పాఠశాల పక్కనున్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. తమ కామవాంఛ తీర్చుకున్న తర్వాత స్థానిక ఆలయం వద్ద వదిలేసి పారిపోయారు. అటుగా వెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.