మరోవైపు కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం జాగిరిపల్లెలో ఓ విషాదం చోటుచేసుకుంది. ఆ గ్రామంలో నివసిస్తున్న అమ్మిరాజు అనే 28 ఏళ్ల వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అమ్మిరాజుకు పెళ్లి జరిగి రెండు రోజులు మాత్రమే అవుతుంది. దీంతో వధూవరుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో బంధువులు కూడా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.