చంద్రబాబు అభివృద్ధికి పట్టం కట్టారు... కళా వెంకట్రావు :: విజేతలు వీరే
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (11:54 IST)
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయ దుందుభి మోగించడంపై మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధికి పట్టంకట్టారని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ... కాకినాడ ప్రజలు ఇచ్చిన తీర్పు చంద్రబాబు సమర్థతకు సంకేతమని అన్నారు. గత మూడున్నరేళ్లుగా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు చంద్రబాబు చేరువయ్యారని, రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన పడుతున్న కష్టాన్నిచూసిన ప్రజలు ఓటు రూపంలో ఇచ్చిన తీర్పే ఈ విజయం అని అన్నారు. ఈ విజయంతో మరింత బాధ్యత పెరిగిందని, మరింత ఉత్సాహంతో ప్రజల్లోకి వెళతానని చెప్పారు.
మరో నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో వైసీపీ నేతల అవాస్తవ ప్రకటనలు, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మలేదని, రాబోయే రోజుల్లో ఆ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని అన్నారు. మిత్రపక్షం బీజేపీతో కలిసి పోటీ చేశామని, తొమ్మిది స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశామని చెప్పారు.
కాగా, ఈ ఎన్నికల్లో గెలుపొందిన విజేతల వివరాలను పరిశీలిస్తే.. మొత్తం 48 వార్డులుండగా, 48 వార్డుల్లో ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ 32, బీజేపీ 3, వైకాపాకు 10, ఇతరులకు 3 వార్డులు దక్కాయి. గెలుపొందిన వారి వివరాలివి...