ముగిసిన మహానాడు - 28 తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం

ఆదివారం, 29 మే 2016 (18:21 IST)
తిరుపతి వేదికగా మూడురోజుల పాటు జరిగిన మహానాడు ముగిసింది. మహానాడులో మొత్తం 28తీర్మానాలకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మొదటిరోజు 11, రెండవరోజు 8, చివరి రోజు తొమ్మిది తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం చేశారు. 26 గంటల పాటు నిరంతరాయంగా తెదేపా నాయకులు ప్రసంగించారు. మొత్తం 146 మంది తెదేపా నాయకులు ప్రసంగించారు. చివరి రోజు ఆర్థికమంత్రి యనమల రామక్రిష్ణుడుతో పాటు తెలంగాణ నేత రేవంత్‌రెడ్డిలు ఆవేశపూరిత ప్రసంగం చేశారు. చివరగా చంద్రబాబు గంటకు పైగా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
 
కుటుంబంకన్నా పార్టీనే తన ముఖ్యమని, అధికారంపై వ్యామోహం లేదన్నారు బాబు. నాకు కులమతాలు లేవంటూ పేదరికమే నా బలమంటూ ఆవేశపూరిత ప్రసంగం చేశారు. ప్రతి పేదకుటుంబానికి పెద్దగా ఉంటానని, ప్రాణాలు, ఆస్తులు పోగొట్టుకున్నా టిడిపిని మాత్రం ముందుకు తీసుకెళుతున్నామన్నారు. తెలుగువారి గుండెల్లో పార్టీ అంటూ ఏదైనా ఉందంటే అది ఒక్క టిడిపి మాత్రమేనన్నారు. పార్టీ కార్యకర్తలే నాకు ప్రాణమని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. మహానాడుకు తెదేపా నాయకులు, కార్యకర్తల నుంచి రూ.11 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చినట్లు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి