వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నడిరోడ్డులో కాల్చిచంపినా పాపం లేదంటూ జగన్ నంద్యాల ఉప ఎన్నికల బహిరంగ సభలో వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. దీనిపై టీడీపీ నేతలు, శ్రేణులు మూకుమ్మడిగా జగన్‌పై ఎదురుదాడికి దిగారు.
ఇందులోభాగంగా, జలీల్ ఖాన్ సోమవారం గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ..ఓట్ల కోసం తప్ప జగన్ అసెంబ్లీలో ఏనాడు ముస్లీంల గురించి మాట్లాడింది లేదన్నారు. ప్రజల వద్దకు వెళ్లి నెత్తిన చేతులుపెట్టడం, ముద్దులు పెట్టడం మినహా ప్రజలకు జగన్ చేస్తున్నది ఏమీ లేదని జలీల్ ఖాన్ ఎద్దేవా చేశారు.