రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌పై సభా హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోలేరు: సోమిరెడ్డి
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (09:09 IST)
రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌పై ఇద్దరు మంత్రులు శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం, ఆయన ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేయడం, సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవడం చెల్లదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.
ఎస్‌ఈసీపై చర్యల కోసం మంత్రులు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం, ఆయన ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేయడం, కమిటీ సమావేశం కావడం, మళ్లీ వాయిదా వేయడం అన్నీ ఆశ్చర్యంగా ఉన్నాయని, సభాహక్కుల ఉల్లంఘటన అనేది శాసనసభ్యులకు మాత్రమే వర్తిస్తుందని సోమిరెడ్డి అన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీ కింద శాసనసభుయలు స్వేచ్ఛగా మాట్లాడటంతో పాటు, స్వతంత్య్రంగా ఓటు వేసే హక్కు కల్పిందని, ఈ ఆర్టికల్ ప్రకారం ఎమ్మెల్యేల హక్కును ఎవరూ తప్పుపట్టేందుకు అవకాశం లేదని, కోర్టులకు కూడా సమీక్షించే అధికారం లేదని, మంత్రి అనేది ఒక పొలిటికల్ పోస్టు అని, వారు ప్రభుత్వంలో ఒక భాగమని ఆయన అన్నారు.
రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల కమీషన్‌పై విచ్చలవిడిగా రాజకీయ విమర్శలు చేసిందని మంత్రులని, దానిపై ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం తప్పా..అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల కమీషన్‌ను మంత్రులు బహిరంగంగా విమర్శించారని, ఆయన బహిరంగంగానే గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని అన్నారు.
1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనమండలిలో ఈనాడు రామోజీరావుపై 'రోశయ్య' ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారని, దాన్ని కోర్టులు తప్పుపట్టాయన్నారు. అదే విధంగా హిందూ, జమీన్‌రైతు అనే పత్రిక విషయంలో కూడా ఇదే పరిస్థితి ఏదురైందని, అప్పుడు కోర్టులు స్టే విధించాయని 'సోమిరెడ్డి' గుర్తు చేశారు.
మహారాష్ట్రలో విలాస్‌రావు దేశ్‌ముఖ్ సిఎంగా ఉన్నప్పుడు ఎస్‌ఈసీపై కక్ష కట్టి రెండు రోజుల జైలు శిక్ష వేశారని, ఈ రోజు జైలులో ఉంచి ఉదయాన్నే విడుదల చేశారని, మహారాష్ట్ర శాసనసభ చర్యను సాక్షాత్తూ సుప్రీంకోర్టే తప్పుట్టిందని ఆయన అన్నారు.
పై ఉదంతాలను పరిగణలోకి తీసుకోకుండా ఎస్‌ఈసీపై విచ్చలవిడిగా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ మళ్లీ ఆయనపై ఫిర్యాదులు చేస్తారా..? అని 'సోమిరెడ్డి' ప్రశ్నించారు. ఎస్‌ఈసీ చేసిన ఫిర్యాదుపై గవర్నర్‌కే మంత్రులు సమాధానం చెప్పుకోవాలని, మంత్రులను నియమించింది ఆయనేనని, వారిని భర్తరఫ్ చేసే అధికారం కూడా ఆయనకే ఉందన్నారు.
రాష్ట్రంలో రెండేళ్లుగా రాజ్యాంగ ఉల్లంఘటనలు, హైకోర్టు తీర్పులు, చట్టాల ఉల్లంఘన పరిపాటగా మారిపోయిందని, కోర్టులు పదే పదే తీర్పులు వ్యతిరేకంగా ఇచ్చినా సమీక్షించుకునే పరిస్థితులో లేరని, బరితెగించిన ప్రభుత్వంగా ముద్ర వేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.