అలాగే దిశా సెంటర్ల కోసం నియమించిన పోలీస్, వైద్య విభాగాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తాం. వెలగపూడి, తిరుపతిలో ఈ నెల 17,18 తేదీల్లో శిక్షణ ఉంటుంది. వన్ స్టాప్ సెంటర్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి పెడతాం’ అని తెలిపారు.
ఈ చట్టంతో రాష్ట్రం లో ప్రత్యేక వ్యవస్థ ఏర్పడబోతోంది. అన్నీ ఒకచోట కేంద్రీకృతం కానుండటంతో చట్టం అమలు సులభతరం కానుంది. జీరో ఎఫ్ఐఆర్ కేసుల నమోదులో, బాధితుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తాం' అని స్పష్టం చేశారు.