89వ పడిలోకి రోశయ్య

శనివారం, 4 జులై 2020 (21:36 IST)
తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య 88వ పుట్టిన రోజు వేడుక వారి గృహంలో ఘనంగా జరిగింది.

వేదపండితులు ఆశీర్వాదములతో మిత్రులు కె.వి.చలమయ్య జొన్నవాడ కామాక్షమ్మ అమ్మవారు, శ్రీ తల్పగిరి రంగనాథస్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి మరియు సూళ్ళూరుపేట చెంగాళమ్మ వార్ల తీర్థ ప్రసాదములు ఇచ్చి కొణిజేటి రోశయ్యను శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా కె.వి. చలమయ్య మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా మరియు అనేక ఉన్నత పదవులను అలకరించి వివాదరహితుడుగా పేరు ప్రఖ్యాతలు పొందరన్నారు.

కోవిడ్ -19 వలన కుటుంబ సభ్యులు మరియు కొంతమంది మిత్రులతో పుట్టిన రోజును సంతోషముగా జరుపుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు