తన ప్రియురాలు సంక్రాంతి పండుగకు ఇంటికెళ్లితే ఇక తిరికిరాదనీ భావించిన ఓ ప్రేమోన్మాది ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని మూసాపేట్ హబీబ్‌నగర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
శ్రీకాకుళం జిల్లా రాజం మండలం వలస గ్రామానికి చెందిన బోను జానకి (24), గొరెండి గ్రామానికి చెందిన బొడ్డెపల్లి రూప (27) అనే ఇద్దరు యువతులు మూసాపేట్‌లోని శక్తి నగర్‌లో నివాసముంటున్నారు. జానకి, రూప ఇద్దరూ డీమార్ట్‌లో సేల్స్ గర్ల్స్‌గా పని చేస్తూ ఇంటికి ఆసరాగా ఉన్నారు.
ఆ తర్వాత తేరుకుని జానకిని చికిత్స నిమిత్తం శక్తి నగర్‌లోని వసుంధర ఆస్పత్రికి తరలించగా, అప్పటికే జానకి చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.