అయితే, అసలు ప్రభాకర్ రెడ్డి తన స్నేహితులతో చివరి సారి ఏమన్నాడన్న దానిపై ఆరాతీయగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'నేను కుకునూర్‌పల్లిలో పనిచేయలేకపోతున్నాను. హైదరాబాద్‌కు బదిలీ చేయించుకుంటాను' అని స్నేహితులతో చెప్పినట్టు తెలుస్తోంది. అధికారుల వేధింపుల వల్లే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కొంత మంది వాదిస్తుండగా, ప్రభాకర్ రెడ్డిఫోటోల్లో కనిపిస్తున్న విధానం చూస్తుంటే... ఆయనను తుపాకీతో కాల్చి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు.