శ్రీరెడ్డి.. సినీ వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా బాగా నానుతున్న పేరు. ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో అర్ధనగ్న ప్రదర్శన చేయడం.. దీనికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యతిరేకంగా ఆమెను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించడం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామల నేపధ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ శ్రీరెడ్డి పైన బ్యాన్ ఎత్తివేస్తూ... ఆమెకు అసోసియేషన్లో సభ్యత్వం ఇస్తామని ప్రకటించారు.
అంతేకాకుండా ఆమెతో నటించేందుకు అసోసియేషన్లో ఉన్న 900 మందికి ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. ఇంతటితో ఈ వివాదానికి ఫుల్‌స్టాఫ్ పడినట్టే అనుకున్నారు కానీ.. అలా కాలేదు. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వివాదం పవన్ కళ్యాణ్ వైపుకు వచ్చింది. పవన్ ఈ వివాదంపై స్పందిస్తూ... శ్రీరెడ్డి తనకు అన్యాయం జరిగినప్పుడు న్యూస్ ఛానల్స్‌కి వెళ్లకుండా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఉండాల్సింది అని చెప్పారు.
పవన్ ఇలా స్పందించడం పైన శ్రీ రెడ్డి ఫైర్ అయ్యింది. పోలీస్ స్టేషనుకి వెళ్లాలి అని తెలియదా..? ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అని బాధపడుతుంటే.. నువ్వు స్పందించే తీరు ఇదేనా..? నిన్ను అన్న అని పిలిచినందుకు సిగ్గుతో నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నాను అంటూ రాయలేనటువంటి భాషతో తిట్టింది. శ్రీరెడ్డి ఇలా తిట్టడంతో పవన్ ఫ్యాన్స్‌కి బాగా కోపం వచ్చింది.
హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల్లో పవన్ ఫ్యాన్స్ శ్రీరెడ్డి పైన కేసు పెట్టారు. అయితే..శ్రీరెడ్డి వ్యవహారం ఇలా పవన్ వైపు రావడం వెనక రాజకీయ కుట్ర ఏదో ఉంది అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి.. ఇది నిజమేనా..? లేక కేవలం పుకారు మాత్రమేనా..? అసలు ఈ వివాదం ఇంకెలాంటి మలుపు తీసుకుంటుందో..? చూడాలి.