నల్ల మార్కెట్‌కు వంట నూనెలలు - మండిపోతున్న ధరలు

సోమవారం, 7 మార్చి 2022 (13:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణం వంట నూనెలను వ్యాపారులు, దళారులు నల్ల మార్కెట్‌కు తరలించి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. దీంతో వీటి ధరలు ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ధరలను చూసిన వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ అధికారుల్లో ఏమాత్రం చలనం కనిపించడం లేదు. 
 
ఈ ధరల పెంపునకు ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య సాగుతున్న యుద్ధాన్ని ఓ కారణంగా చెబుతున్నారు. అలాగే, దేశ వ్యాప్తంగా వంట నూనెల కొరత ఉందని వ్యాపారాలు ఆరోపిస్తున్నారు. దీంతో వంట నూనెల ధరలను ఇష్టానుసారంగా పెంచేసిన వ్యాపారులు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. తిరుపతిలోని పలు దుకాణామాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అధిక ధరలకు వంట నూనెలను విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. 
 
కాగా, నల్ల వ్యాపారానికి పాల్పడుతున్న దుకాణాల యజమానులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా నూనెల ప్యాకెట్ల నిల్వ, నూనె ప్యాకెట్లపై అధిక రేట్లతో స్టిక్కర్లు అంటించి విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కొనుగోలుదారులు డిమాండ్ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు