ఎంత దౌర్భాగ్యం.. తప్పులు తడకగా సీఎం తెలుగు ప్రసంగ పఠనం!!

గురువారం, 1 నవంబరు 2012 (13:05 IST)
File
FILE
ఎంత దౌర్భాగ్యం.. సాక్షాత్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి తెలుగును చదవడం కూడా రాదా? అవుననే సమాధానం ఆయనే స్వయంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు గురువారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగురవేరవేసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు.. రాష్ట్ర ప్రగతిపై ప్రసంగించారు. ఇందుకోసం ఆయన ముందుగానే తెలుగులో ఒక ప్రసంగాన్ని తయారు చేసుకున్నారు.

ఈ ప్రసంగాన్ని బుల్లెట్ ప్రూఫ్ పోడియం నుంచి ప్రసంగించారు. ఆ సమయంలో రాష్ట్ర 'పురోగమనం', 'పురోగతి' వంటి పదాలతో పాటు అనేక కఠిన పదాలు వచ్చినపుడు వాటిని ఉచ్ఛరించలేక అచ్చు తప్పులు పలికారు. అక్షరాలా తెలుగులో రాసుకున్న ప్రసంగ పాఠాన్ని కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చదవలేకపోవడం గమనార్హం. ఇలాంటి పాలకులు యువతను దేశ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతారా? అని జనం అనుకోవడం కనిపించింది.

వెబ్దునియా పై చదవండి