జగన్ - మోపిదేవి భాయ్.. భాయ్ : ధర్మానతో దూరం.. దూరం!!

బుధవారం, 5 డిశెంబరు 2012 (14:52 IST)
File
FILE
చంచల్‌గూడ జైలుకు చెందిన వీవీఐపీ ఖైదీలంతా బుధవారం గగన్ విహార్ కోర్టులో కలుసుకున్నారు. వీరంతా జగన్ అక్రమాస్తుల కేసుతో పాటు.. ఓబుళాపురం అక్రమ మైనింగ్, వాన్‌పిక్ భూముల కేటాయింపుల్లో చోటు చేసుకున్న అవకతవకల కేసుల్లో అరెస్టు అయి చంచల్‌గూడా జైలులో ఉన్నారు. వీరి రిమాండ్ గడువు బుధవారంతో ముగిసింది. దీంతో వీరిని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా, ఈ కేసులను విచారిస్తున్న న్యాయమూర్తి ధర్మారావు సెలవుపై ఉండటంతో గగన్ విహార్ కోర్టులో హాజరుపరిచారు.

ఇందుకోసం ప్రత్యేక వాహనాల్లో జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ, నిమ్మగడ్డ ప్రసాద్, రాజగోపాల్ తదితరులను ప్రత్యేక వాహనాల్లో గట్టి భద్రత నడుమ తరలించారు. వీరందరినీ కోర్టు హాలులో ఉంచారు. అపుడు జగన్ కంటే ముందే కోర్టుకు చేరుకున్న మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణను, ఇతరులను నవ్వుతూ పలకరించారు. మోపిదేవితో కరచాలనం కూడా చేశారు. అయితే మంత్రి ధర్మాన ప్రసాద రావుతో మాత్రం ఎడమొహం పెడమొహంగా కనిపించారు.

అయితే గతంలో వచ్చినప్పుడు ధర్మానతో మాట్లాడటం గమనార్హం. ప్రభుత్వ అధికారి శ్యామ్యూల్‌తో రహస్యంగా మాట్లాడటం గమనార్హం. పిమ్మట భార్య భారతీ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో, ఆడిటర్ విజయ సాయి రెడ్డితో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత జైలు అధికారులు జగన్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మిగిలిన నిందితులను కేసు విచారణ పూర్తి కాగానే జైలుకు తరలించారు.

వెబ్దునియా పై చదవండి