అక్బరుద్దీన్‌... ఫిబ్రవరి 4న కోర్టుకు రండి... వ్యాఖ్యల చిక్కులు

గురువారం, 10 జనవరి 2013 (21:47 IST)
FILE
అక్బరుద్దీన్ హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలు చిక్కులు తెచ్చాయి. అక్బర్ కు వరంగల్ కోర్టు నోటీసులు పంపింది. ఫిబ్రవరి 4న కోర్టులో హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్బరుద్దీన్ కేసులతో రాష్ట్రం నలుమూలలా తిరుగుతారా అన్నట్లు పరిస్థితి తయారైంది.

మరోవైపు హైదరాబాదు రంగారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో జైలు పాలైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్భరుద్ధీన్ ఓవైసీని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయి ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఫవ్వ అక్బరుద్ధీన్‌ను పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకువచ్చే విషయంలో న్యాయపరమైన అంశాలపై ఓయూ పోలీసులు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిసింది. అక్భరుద్ధీన్ ప్రసంగాన్ని ప్రసారం చేసిన ఛానెళ్లకు పోలీసులు నోటీసులు ఇచ్చి ప్రసంగం వివరాలను తీసుకోనున్నట్లు సమాచారం.

కాగా నిర్మల్‌ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలెదుర్కొన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసి మేజిస్ట్రేట్‌ విచారణానంతరం దోషిగా తేలడంతో ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. కాగా నిర్మల్‌ కోర్టు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ విచారణ చేసిన తర్వాత అక్బరుద్ధీన్‌పై అదనంగా మరో ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి ఆదిలాబాద్‌ జిల్లా జైలుకు తరలించారు.

ప్రస్తుతం అక్బరుద్దీన్‌ జిల్లా జైల్లో అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఉన్నారు. ఆయనకు ఖైదీ నెంబర్‌ 7645 కేటాయించారు. ఆయనపై మొదట 121, 153(ఎ) సెక్షన్లు నమోదు చేసిన పోలీసులు, కోర్టు విచారణానంతరం అదనంగా 120(బి), 124(ఎ), 295(ఎ), 505, 188 సెక్షన్లు నమోదు చేసినట్లు కరీంనగర్‌ రేంజ్‌ డిఐజి బీమానాయక్‌ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి