అభ్యర్ధుల జాబితాతో ఢిల్లీకి వైఎస్-డీఎస్

అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ చివరి దఫా కసరత్తులు ప్రారంభించింది. గత కొన్ని రోజులగా అభ్యర్థుల ఎంపికపై తీవ్రస్థాయిలో మంతనాలు, రోజూ గంటల కొద్దీ సమీక్షలు, చర్చలు జరిపి ఒక జాబితాను తయారు చేశారు. ఆ తర్వాత దీనిపై అధినేత్రి సోనియా గాంధీతో ఆమోదముద్ర వేయించేందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌లు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళుతున్నారు.

హైదరాబాద్‌లో తయారు చేసిన జాబితాను ఆదివారం హస్తినలోని అధిష్టానం ముందు ఉంచుతారు. పార్టీ అధినేత్రి సోనియా ఆమోద ముద్ర వేసిన తర్వాతనే తొలి జాబితాను విడుదల చేస్తారని పిసిసి వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు, కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల బలాబలాలను పరిశీలించి పిదప, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించి 1200 మంది అభ్యర్థులతో ఓ భారీ జాబితాను తయారు చేసినట్టు చెప్పారు. ఇందులో నుంచి గెలుపు గుర్రాలను ఆదివారం ఎంపిక చేసి, వెల్లడిస్తారు.

వెబ్దునియా పై చదవండి