అవినీతిమయ ప్రభుత్వం: కాంగ్రెస్‌పై చిరు నిప్పులు

FileFILE
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకోవడం, దాచుకోవడానికే పరిమితమయిందని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆరోపించారు. ఆదిలాబాద్ ప్రజలు రాష్ట్ర ప్రజలు కాదా అని ప్రశ్నించారు. వీరిని ఎందుకు వదిలేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. మందుల సరఫరా కేంద్రం నుంచి జరగాలట.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇవ్వడం లేదు.. ఇదేనా ప్రజలపట్ల ఉన్న ప్రేమ.

వీరికి ఏ కారణంతో మనలను పాలించే అధికారం ఉందని.. అధికార కాంగ్రెస్ పార్టీపై చిరు విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన ఆదిలాబాద్ జిల్లాలో చివరి రోజు పర్యటన నిర్వహించారు. పలు మండల కేంద్రాల్లో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిందన్నారు. నువ్వెన్ని తిన్నావంటే.. నువ్వెన్ని తిన్నావని ఆరోపించుకుంటున్నారు.

పెన్‌గంగ అంతరాష్ట్ర వివాదం అలాగే ఉంది. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. కనీసం వాటి గురించి శ్రద్ధలేదు. ఎంత కమిషన్ వస్తుందనే దానిపైనా ప్రభుత్వపెద్దల దృష్టంతా ఉందని చిరు పరోక్షంగా విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎవరూ సుఖంగా ఉన్నట్టు లేదు. అమాయకులైన అడవి బిడ్డలు నివసించే ఆదిలాబాద్ ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి