ఎరువుల గోదాములపై రైతుల దాడి

శుక్రవారం, 3 అక్టోబరు 2008 (20:03 IST)
ఎరువుల కొరతతో రైతన్నల ఆగ్రహం రోజురోజుకి పెచ్చరిల్లుతోంది. ఖమ్మం జిల్లాలో ఎరువుల కొరతపై అన్నదాతలు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఎరువుల కోసం రైతు సేవాకేంద్రాల వద్ద ఉదయం నుంచి రైతులు గుమిగూడారు. చివరకు అధికారులు ఎరువులను ఇతర గ్రామాలకు తరలిస్తుండడంతో రైతులు కోపోద్రిక్తులై రైతుసేవా కేంద్రంపై దాడిచేసి ఎరువులను లూటీ చేశారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు సేవా కేంద్రం వద్దకు చేరుకుని అన్నదాతలపై లాఠీ ఛార్జీ ప్రయోగించారు. దీనితో పలువురి రైతులకు గాయాలయ్యాయి.

మరోవైపు గుంటూరు జిల్లా నకిరెకల్‌లో ఎరువుల పంపిణీలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఎరువులను సక్రమంగా పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం వ్యవసాయ అధికారిపై మహిళా రైతులు దాడికి చేయడంతో ఇక్కడి పరిస్థితి ఉద్రిక్తతగా మారింది.

వెబ్దునియా పై చదవండి