కాంగ్రెస్‌కు చరమగీతం : చంద్రబాబు

కేంద్రంలో, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో రెండు విడతలుగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుసున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన ప్రకటించారు.

కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన అనంతరం చంద్రబాబు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఎన్నికల నిబంధనావళి తక్షణమే అమలులోకి రావడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం విడుదల చేస్తున్న అక్రమ జీవోలకు అడ్డుకట్టపడినట్లైందని హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోగానే మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తవుతుందని ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే... ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన మూడో ప్రత్యామ్నాయమే, కేంద్రంలో అధికారంలోకి రావడం తథ్యమని చంద్రబాబునాయుడు జోస్యం చెప్పారు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి.. ఇక నూకలు చెల్లినట్లేనని చంద్రబాబు తేల్చి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి