కిరణ్ కర్రీ పాయింట్... కేసీఆర్ బాబాయ్ హోటల్... తెలంగాణ vs సీమాంధ్ర

శనివారం, 10 ఆగస్టు 2013 (18:20 IST)
WD
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన వల్ల తలెత్తే ఇబ్బందులు, కష్టాలను గురించి విశదీకరించారు. దీనిపై కేసీఆర్ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. హైదరాబాదు నగరంపై కిరణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన కుటుంబం హైదరాబాదులోనే ఉండొచ్చు. ఎక్కడో ఒక దగ్గర కర్రీ పాయింట్ కూడా పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని హేళన చేస్తూ మాట్లాడారు.

కేసీఆర్ వ్యాఖ్యలపై రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ వ్యాఖ్యల వల్లే అటు తెలంగాణ ఇటు సీమాంధ్ర ప్రాంత ప్రజలలో అభద్రతా భావం పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కూడా విశాఖ పట్టణంలో 'బాబాయ్ హోటల్'లా ఏదైనా పెట్టుకోవచ్చని తాము అనలేక కాదనీ, మాట్లాడేటపుడు కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు.

వెబ్దునియా పై చదవండి