కృష్ణావతారంలో కిరణ్ కుమార్ రెడ్డి... నెక్లెస్ రోడ్డులో దర్శనం

శుక్రవారం, 23 నవంబరు 2012 (19:32 IST)
PR
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని శ్రీకృష్ణుని అవతారంలో చూడాలనుకుంటున్నారా...? అయితే నేరుగా హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డుకు వెళితే సరి. అక్కడ శ్రీకృష్ణుని అవతారంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దర్శనమిస్తారు.

అసలు విషయం ఏంటయా అంటే... కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దగ్గర్నుంచి ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి. అయినా రెండేళ్లు ముఖ్యమంత్రిగా సాగారు. ఇంకా సాగుతూనే ఉన్నారు. మధ్యమధ్యలో తెలంగాణ ఉద్యమాలు, ఎమ్మెల్యేల జంప్‌లు... ఇలా ఎన్ని జరుగుతున్నా ఆయన మాత్రం తన పని తను చేసుకుని వెళుతున్నారు.

ముఖ్యమంత్రిగా 2 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంలో హైదరాబాద్ నగర కాంగ్రెస్ కమిటీకి ఓ ఆలోచన వచ్చింది. అదే శంఖు, చక్రంతో శ్రీకృష్ణుని రూపులో కిరణ్ కుమార్ రెడ్డి కటౌట్ పెట్టాలని. అనుకున్నదే తడవుగా ఆలోచనకు కార్యరూపం ఇచ్చారు. నెక్లెస్ రోడ్డులో పెట్టేశారు. అటుగా వెళ్లేవారు కృష్ణావతారంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీని చూడకుండా వెళ్లడం లేదు మరి.

వెబ్దునియా పై చదవండి