కేసీఆరూ.. చర్చలకు డేట్ ఫిక్స్ చేసుకో..!: లగడపాటి

FILE
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కొత్త ఉద్యోగాలు లభించవనే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యలపై దుమారం రేగింది. లగడపాటి అసత్యపు వ్యాఖ్యలు చేస్తున్నారని, కాబట్టి ఆయనకు అబద్ధపు పద్మశీ అవార్డు ఇవ్వాలని తెరాస నేతలు దుయ్యబట్టారు.

తెరాస విమర్శలపై స్పందించిన లగడపాటి రాజగోపాల్ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావుకు ప్రతి సవాలు విసిరారు. ఈ సందర్భంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడిన లగడపాటి రాజగోపాల్.. తెలంగాణపై తాను ఎలాంటి చర్చకైనా సిద్ధమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణపై చర్చకు తెరాస అధినేతను తేదీని నిర్ణయించుకోవాల్సిందిగా సవాలు విసిరారు.

ఈ అంశంపై చర్చించేందుకు కేసీఆర్ తేదీ, స్థలం, సమయాన్ని నిర్ణయించుకుంటే.. చర్చలు తాను సంసిద్ధంగా ఉన్నానని లగడపాటి పునరుద్ఘాటించారు. అవాస్తవాలు చెప్పి అమాయకుల ఆత్మహత్యలు తెలంగాణ నేతలు కారణమవుతున్నారని లగడపాటి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా వేర్పాటువాదుల విష ప్రచారానికి ఎంతోమంది అమాయక యువత, విద్యార్థులు ఆత్మహత్యలతో బలైపోయారని లగడపాటి అన్నారు.

ఇదిలా ఉంటే.. ప్రత్యేక తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీకి లగడపాటి శుక్రవారం లగడపాటి ఆరవ నివేదికను అందజేశారు. ఈ నివేదికలో ఏ తెలంగాణ నాయకుడు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఆత్మహత్యలకు పాల్పడలేదని ఎత్తిచూపారు.

వెబ్దునియా పై చదవండి