కేసీఆరూ.. "వరద" రాజకీయాలు మానుకోండి: శోభానాగిరెడ్డి

FILE
రాష్ట్రంలోని కర్నూలు, మహబూబ్‌నగర్, గుంటూరు, కృష్ణా జిల్లాలు వరదలతో అతలాకుతలమైన ప్రస్తుత పరిస్థితుల్లో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ ప్రాజెక్టులపై విమర్శలు చేయడం సబబు కాదని ప్రజారాజ్యం పార్టీ ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి హితవు పలికారు.

శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 854 అడుగులు ఉండవచ్చునని ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే నిర్ణయించారని తెలిపారు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్న అక్రమ ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనివని శోభానాగిరెడ్డి గుర్తు చేశారు.

తెదేపా హయాంలో అక్రమ ప్రాజెక్టులపై నోరువిప్పని కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఒక ప్రక్క వరద బీభత్సంతో ప్రజలు తల్లడిల్లి పోతుంటే... కేసీఆర్ ఇలా రాజకీయాలు చేయడం సరికాదన్నారు. అలాగే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమైనవని శోభానాగిరెడ్డి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి