గాంధీ భవన్‌ను చూడని వారిని ఎమ్మెల్యేలు చేశారు : సుధాకర్

సోమవారం, 10 సెప్టెంబరు 2012 (13:29 IST)
File
FILE
గతంలో గాంధీ భవన్ ముఖం చూడని వారిని కూడా ఎమ్మెల్యేలుగా చేశారని యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు టి సుధాకర్ బాబు ఆరోపించారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులే పునరావృత్తమైతే కాంగ్రెస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్‌ను సోమవారం ఉదయం హైదరాబాద్‌ లేక్‌వ్యూ అతిథి గృహంలో సుధాకర్ బాబుతో పాటు మరికొంది కాంగ్రెస్ నేతలు కలుసుకుని తమ మనోభావాలను వెల్లడించారు.

ఆజాద్‌తో భేటీ అనంతరం సుధాకర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ కోసం నిరంతరంగా పనిచేసే వ్యక్తులకే నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలని సూచినట్టు చెప్పారు. ముఖ్యంగా పార్టీ పట్ల నిబద్ధత కలిగిన నేతలకు అన్యాయం జరుగకుండా చూడాలని కోరినట్టు చెప్పారు. పార్టీలో లోపించిన క్రమశిక్షణా రాహిత్యంపై ఆజాద్కు సుధాకర్ బాబు ఫిర్యాదు చేశారు. అలాగే, పార్టీలో ఉంటూనే కోవర్టులుగా పని చేస్తున్న వారి వివరాలను కూడా ఆజాద్‌కు తెలియజేసినట్టు సుధాకర్ బాబు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి