గిరిజన మహిళపైకి చేయి ఎత్తిన చంద్రబాబు నాయుడు

FILE
తూర్పు గోదావరి జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. పత్తిపాడు మండలం వంతాడ గ్రామంలో మైనింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న చంద్రబాబుపై స్థానిక గిరిజన మహిళలు తిరగబడటంతో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు పరాభవంతో ఆ ఊరి నుంచి తిరుగుముఖం పట్టారు.

వంతాడ గ్రామంలో పర్యటించిన చంద్రబాబు గిరిజన మహిళలకు అన్యాయం జరుగుతుందని, మీకు న్యాయం చేస్తానని వ్యాఖ్యానించిన బాబును నిలదీశారు. దీంతో సహనం కోల్పోయిన చంద్రబాబు నన్నే ప్రశ్నిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంకా గదమాయించి వారిని అదుపుచేసేందుకు ప్రయత్నించారు. కుదరకపోవడంతో నోటికి వచ్చినట్లు మాట్లాడి.. గిరిజన మహిళలపై చేయి చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదనీ, తనను వెనుక నుంచి కొంతమంది బలంగా తోయడం మూలాన బాబు తనను నెట్టారని సదరు మహిళ చెప్పింది.

వెబ్దునియా పై చదవండి