చంద్రబాబు ఆదేశం మేరకు రాజీనామా చేశాం: టితెదేపా

తమ శాసనసభ సభ్యత్వాలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే రాజీనామా చేసినట్టు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం నేతలు ప్రకటించారు. దీనిపై మాజీ మంత్రి కడయం శ్రీహరి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అనుమతి మేరకు రాజీనామా చేసినట్టు చెప్పారు.

తెదేపా ఫోరం చేపట్టిన బస్సు యాత్ర శనివారం అదిలాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధుల రాజీనామాలతో రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడిందన్నారు.

అందువల్ల ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకు తాము చేసిన రాజీనామాలపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి